AP CM Chandrababu Naidu conducted a review meeting over Intintiki Telugu Desam programme. In that programme he made jokes on mla's and party leaders.
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. అయితే నేతల అలసత్వ వైఖరితో కొన్నిచోట్ల ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నత్తనడకన నడుస్తున్నట్టు సీఎం చంద్రబాబుకు రిపోర్టులు అందుతున్నాయి. దీంతో సదరు నేతలను పిలిపించుకుని మరీ వారికి ఆయన క్లాస్ పీకుతున్నారు.
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై బుధవారం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. తనకు అందిన రిపోర్టుల ఆధారంగా ఒక్కొక్కరిపై ఒక్కో తరహాలో జోకులు పేల్చారు. సున్నితంగా మందలిస్తూనే చురకలంటించే ప్రయత్నం చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, గన్నవరం వంశీ తదితరులు తమ సొంత టెక్నాలజీని వాడుతున్నట్టు రిపోర్టుల్లో తేలడంతో.. ప్రభుత్వ టెక్నాలజీ పనిచేయడం లేదా? అంటూ వారిని ఛమత్కరించారు.తెనాలి ఎమ్మెల్యే గురించి ప్రస్తావిస్తూ.. ఆయనెక్కడున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. ఢిల్లీ వెళ్లారన్న సమాధానం రావడంతో.. 'అయితే అడిగానని చెప్పండి, క్షేమ సమాచారాలు అడగండి' అంటూ పంచ్ విసిరారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే రామారావుపై కూడా ఇదే తరహాలో జోక్స్ వేశారు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారని అధికారులు చెప్పడంతో.. 'ఇంటర్నెట్ ద్వారా ఆయనకు హలో చెప్పండి' అంటూ ఛమత్కరించారు.